HNK: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని గృహ విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.