KDP: 10 రోజుల క్రితం టన్ను అరటి కాయల ధరలు రూ.26 వేలు పలికింది. ప్రస్తుతం టన్ను అరటి రూ.8 వేల నుంచి రూ.15 వేల లోపే ఉన్నాయని రైతులు తెలిపారు. దీంతో అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల్లో యుద్ధ ప్రభావంతో అరటి ధరలు తగ్గాయని, ఎగుమతులు లేవన్న సాకుతో వ్యాపారులు, దళారులు రైతులను నిలువునా మోసం చేస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు.