TG: హైదరాబాద్కు చెందిన టెకీ, న్యాయవాది మానసి చౌదరి మహిళల కోసం చేస్తున్న కృషిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఆమె.. చట్టాలపై అవగాహన కోసం ‘పింక్ లీగల్’ ప్రారంభించారు. అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలితో కలిసి ‘న్యాయరీ’తో బాధితులకు ఉచిత న్యాయసాయం చేస్తున్నారు. చట్టాలను వివరిస్తూ, ఇప్పటికే లక్షకుపైగా మహిళలకు అండగా నిలిచారు.