KMM: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో కొలువైన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి గురువారం తెల్లవారుజామున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్న మంత్రికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు.