AP: వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షాన నిలబడలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ‘వైసీపీ హయాంలో RBKలు నిర్మించి ఉంటే రూ.282 కోట్లకే పనులు పూర్తయ్యేవి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే నిర్మాణ వ్యయం రూ.502 కోట్లకు పెరిగింది. 2,057 రైతు సేవా కేంద్రాలు వివిధ దశల్లో ఉన్నాయి. 2,782 కేంద్రాలు ఇంకా ప్రారంభించలేదు. వీటిని సత్వరమే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాం’ అని తెలిపారు.