GDWL: గద్వాల పట్టణంలోని ఒక హోటల్లో వెయిటర్‌గా పనిచేస్తున్న ఒడిశా యువకుడు సూరజ్ బెహరా (22) గురువారం అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్సై కళ్యాణ్ రావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సూరజ్ మృతిపై తోటి సిబ్బంది పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.