RR: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన 40 మంది లబ్ధిదారులకు రూ. 40,04,640 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. మియాపూర్లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డిలతో కలిసి ఆయన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.