MBNR: జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు మంగళవారం ఒక మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తనకు పాల్పడిన నిందితుడు యెర్ర సురేష్‌కు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధించింది. 2022లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టి, చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం నిందితుడిని దోషిగా నిర్ధారించి శిక్ష పడింది.