అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బొడేడ ప్రసాద్ నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం కేంద్ర పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రసాద్ ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తనకు అవకాశం కల్పించిన జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.