ఐపీఎల్ 19వ సీజన్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ ప్రారంభ మ్యాచ్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌కు కూడా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానున్నట్లు సమాచారం. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గతేడాది రన్నరప్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య తొలి పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది.