SKLM: టెక్కలిలోని ఎన్టీఆర్ నగర్లో మండల బీజేపీ అధ్యక్షులు జర్జాన రాంజీ మంగళవారం పర్యటించారు. ఈ మేరకు కాలనీలోని పలు వీధులను పరిశీలించి, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, చెత్త బుట్ ల్లో వేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. డయేరియా వ్యాధి ప్రబలతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.