VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన మహిళా మూర్తులకు స్త్రీ శక్తి ఉమెన్ పవర్ ఆఫ్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ పురస్కారాలను అందజేశారు. విశ్వ సాహితీ కళావేదిక విజయవాడలో బాలోత్సవ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన భోగరాజు సూర్యలక్ష్మీ, జ్యోతిష్య, మహాలక్ష్మీ, దాసరి పద్మ స్త్రీ శక్తి పురస్కారాలను అందుకున్నారు.