JGL: జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న మల్లాపూర్ గ్రామానికి చెందిన కాశవత్తుల పెద్ద గంగారం(58) గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్య కారణాలతో వైద్య పరీక్షలకు వచ్చిన ఆయన, స్వగ్రామానికి వెళ్ళేందుకు బస్టాండ్లో వేచి ఉన్నప్పుడు అకస్మాత్తుగా కుప్పకూలి మరణించారు. వైద్యులు చూసి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయారు.