E.G: కాతేరులో నైతిక విద్యా సదస్సులో ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. వ్యక్తి మారితేనే సమాజం మారుతుందని, మనం కట్టుబాటుతో జీవించడం కేవలం విద్య ద్వారా సాధ్యమని తెలిపారు. సెల్ ఫోన్ దుష్ప్రభావాలను నివారించి, పుస్తక పఠనం, క్రీడలు, యోగా అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు.