AKP: గొలుగొండ మండలం సిహెచ్. ఎర్రవరంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నూకరాజు పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. సర్వేయర్ సత్యనారాయణ, వీఆర్వో శ్రీనివాస్ భూరికార్డుల వివరాలు రైతులకు వివరించారు. ప్రభుత్వం రైతుల భూహక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.