TG: పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా మారుతుండటంతో గల్ఫ్ దేశాల్లోని తెలుగువారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. టెహ్రాన్‌లో చదువుతున్న పాతబస్తీ విద్యార్థులు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కరీంనగర్, నిజామాబాద్ కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇజ్రాయెల్‌లోని తెలుగువారు బంకర్లలో తలదాచుకుంటుండగా, వారి భద్రతపై ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.