KMM: అర్బన్ పరిధిలోని వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లపై ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి అకస్మాత్తుగా సుమారు 800 ఇళ్లను కూల్చివేసిన ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇల్లు కోల్పోయిన బాధితులను ఆదివారం పరామర్శించేందుకు AIFB జిల్లా నాయకులు, బుడగం నాగేశ్వరరావు, చండ్రా రవి సంఘటన స్థలానికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు.