ATP: గుత్తి మండలం శ్రీపురం గ్రామానికి చెందిన లింగమయ్య అనే వ్యక్తి ఆదివారం కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో విష ద్రావణం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న లింగమయ్యను గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.