విజయనగరం: కొత్తవలస కూడలికి అనుకోని ఉన్న ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన కాంప్లెక్స్ మరమ్మతులకు గురవ్వడంతో ఆ శాఖకు చెందిన అధికారులు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొత్తం తొమ్మిది షాపులు ఉండగా, మూడు షాపులు శిథిలాస్థితికి చేరుకోవడంతో మరమ్మతులు కోసం రూ 7.15 లక్షల నిధులతో మొత్తం షాపులు అందుబాటులోకి తీసుకువస్తామని సీనియర్ అసిస్టెంట్ ఎస్.సత్యనారాయణ చెప్పారు.