కృష్ణా: మచిలీపట్నంలోని చైతన్య కాలేజ్ బస్సు డ్రైవర్లకు ఎస్సై జగదీష్ కుమార్ శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్సు డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. డ్రైవర్లు తప్పనిసరిగా వేగ పరిమితిని పాటించి, విద్యార్థులను ఎక్కించడం, దింపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.