AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో క్షతగాత్రుల పరిస్థితిపై మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు. ‘క్షతగాత్రుల పరిస్థితి విషమంగానే ఉంది. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. అక్కడ ఎక్కువ మంది కార్మికులతో పనిచేస్తున్నట్లు దృష్టికి వచ్చింది. అందులో కొందరికి తయారీలో పూర్తిస్థాయి నైపుణ్యం లేకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తేలింది’ అని పేర్కొన్నారు.