బాపట్ల: సంతమాగులూరు శాఖ గ్రంథాలయంలో ఆదివారం స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవ నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.