ATP: కోర్టు విచారణలో సాక్షులను సకాలంలో హాజరుపరిచి, నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని అనంతపురం SP జగదీష్ కోర్టు కానిస్టేబుళ్లను ఆదేశించారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో కోర్టు మానిటరింగ్ విభాగం సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 14న నిర్వహించనున్న లోక్ అదాలత్‌పై పలు సూచనలు చేశారు. నూతనంగా అమల్లోకి వచ్చిన BNSS చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.