KDP: కమలాపురం కెమిస్ట్,డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమలాపురంలోని స్థానిక వెన్నెల పాఠశాలలో నేడు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేస్తారన్నారు. మండల పరిసర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.