AP: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని పేలుడు ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు చనిపోయారన్న విషయం అత్యంత దుఃఖాన్ని కల్గించిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.