E.G: రాజమండ్రి జాంపేట సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. లైన్ నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు కరెంటు నిలిపివేస్తున్నట్లు ఎలక్ట్రికల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. సబ్ కలెక్టర్ ఆఫీసు ఏరియా, లక్ష్మివారపుపేట, సూర్య హోటల్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.