W.G: మొగల్తూరుకు చెందిన వనం రాజేశ్ ఖన్నా, వనం లక్ష్మీనారాయణ చెదమందు స్ప్రే చేస్తుండగా స్ప్రేయర్ పేలి తీవ్రంగా గాయపడ్డారు. శనివారం వీరి పరిస్థితిని సమీక్షించిన MLA నాయకర్ మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వానికి నివేదించారు. దీనికి స్పందించిన ప్రభుత్వం సీఎం సహాయనిధి నుంచి రూ. 5,03,622 విలువైన ఎల్ఓసీ పత్రాలను మంజూరు చేసింది. ఈ పత్రాలను MLA బాధితులకు అందచేశారు.