VKB: జిల్లా కలెక్టర్గా దీపక్ తివారి బాధ్యతలు స్వీకరించారు. శనివారం జిల్లా అధికారులు నూతన కలెక్టర్కు స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ పరిపాలన యంత్రాంగాన్ని సరైన విధంగా నడిపిస్తామని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామంటూ, అధికారులంతా కలిసికట్టుగా పని చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.