పల్లెకెలె వేదికగా పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ సెమీస్కు చేరాలంటే ఈ మ్యాచ్లో కనీసం 65 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో న్యూజిలాండ్ సెమీస్కు అర్హత సాధిస్తుంది. కాగా, శ్రీలంక ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.