MLG: తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ వనదేవతలను శనివారం సాయంత్రం ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు అమ్మవార్లకు చీర, సారే సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, SP తదితరులు ఉన్నారు.