పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. T20 WC అనంతరం కెప్టెన్ సల్మాన్ ఆఘాపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. జట్టు పేలవ ప్రదర్శనపై పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే జట్టులోని సీనియర్ ఆటగాళ్లు ఆఘా, బాబర్, ఉస్మాన్ ఖాన్లను T20 జట్టు నుంచి పూర్తిగా తప్పించనున్నట్లు సమాచారం.