CTR: గుడిపాల పలు గ్రామాల్లో అడవి ఏనుగుల సంచారాన్ని అరికట్టేందుకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు 4 కుంకీ ఏనుగులను రప్పించారు. ఈ ఏనుగులకు ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవులు నాయుడు స్థానిక అటవీశాఖా సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ చర్యతో పంట నష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.