AP: సర్వైకల్ క్యాన్సర్ నివారణలో HPV వ్యాక్సిన్ కీలకమని సీఎం చంద్రబాబు తెలిపారు. మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పారు. బహిరంగ మార్కెట్లో ఈ వ్యాక్సిన్‌కు రూ.4 వేల ఖర్చవుతుందని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఖర్చును భరించేందుకు ముందుకొచ్చారని అన్నారు. ఆహారపు అలవాట్లతోనే క్యాన్సర్ ముప్పు పెరుగుతోందన్నారు.