AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలోకి వ్యక్తి చొరబాటు ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. భద్రతా విభాగం నుంచి ఐదుగురిని మాతృశాఖకు పంపారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ బి.పెంటారావుతోపాటు నలుగురు కానిస్టేబుళ్లను మాతృవిభాగంతో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ప్రాథమిక విచారణలో భద్రతా వైఫల్యాలు రుజువుకావటంతో చర్యలు తీసుకున్నారు.