E.G: మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ (సెర్వికల్ క్యాన్సర్) నివారణకు ఈనెల 28 నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని MP పురందేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలు, యువతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని.. తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలన్నారు.