Arudra : ప్రముఖ రచయిత్రి ఆరుద్ర సతీమణి కన్నుమూత..
ప్రముఖ రచయిత్రి ఆరుద్ర (Arudra) సతీమణి కె. రామలక్ష్మీ కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్థాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ (Hyderabad)మలక్‌పేట్‌లోని తన నివాసంలో శుక్రవారం కన్నుమూశారు.1930 డిసెంబర్ 31న కోటనందూరులో జన్మించిన రామలక్ష్మీ.. మద్రాస్ (madras) యూనివర్సిటీ నుంచి బీఏ పట్టభద్రురాలయ్యారు.
ప్రముఖ రచయిత్రి ఆరుద్ర (Arudra) సతీమణి కె. రామలక్ష్మీ కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్థాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ (Hyderabad)మలక్‌పేట్‌లోని తన నివాసంలో శుక్రవారం కన్నుమూశారు.1930 డిసెంబర్ 31న కోటనందూరులో జన్మించిన రామలక్ష్మీ.. మద్రాస్ (madras) యూనివర్సిటీ నుంచి బీఏ పట్టభద్రురాలయ్యారు. 1951 నుంచి రచనలు సాగిస్తున్నారు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీష్ విభాగానికి ఉప సంపాదకులుగా పలు అనువాదాలు చేశారు రామలక్ష్మీ. విడదీసే రైలుబళ్ళు , అవతలిగట్టు, మెరుపుతీగె, తొణికిన స్వర్గం, మానని గాయం, అణిముత్యం, పెళ్ళి, ప్రేమించు ప్రేమకై, ఆడది, ఆశకు సంకెళ్ళు, కరుణ కథ, లవంగి, ఆంధ్ర నాయకుడు, పండరంగని ప్రతిజ్ఞ , నీదే నాహృదయం, అద్దం, ఒక జీవికి స్వేచ్ఛ వంటి కథాసంకలనాలను రామలక్ష్మీ రచించారు.
తెలుగు సాహిత్య రంగానికి చేసిన సేవలకు గాను ఆమెకు గృహలక్ష్మి,(Gr̥halakṣmi)స్వర్ణకంకణం సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి.సాహిత్య సేవతో పాటు అనేక స్త్రీ సంక్షేమ సంస్థలలో పనిచేసి.. మహిళల శ్రేయస్సు కోసం రామలక్ష్మీ పాటుపడ్డారు. 1954లో సినీ రచయిత, కవి ఆరుద్రతో రామలక్ష్మీకి వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఈ రోజు సాయంత్రమే రామలక్ష్మీ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణం పట్ల పలువురు రచయితలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. కె.రామలక్ష్మి సెన్సార్ బోర్డ్ (Sensar board)మెంబర్ గానూ పనిచేశారు. 1979లో దాసరి నారాయణరావు రూపొందించిన యువచిత్ర వారి ‘గోరింటాకు’ చిత్రానికి కథ కె.రామలక్ష్మి (Ramalaxmi)అన్న టైటిల్ కార్డ్ వేశారు.
నిజానికి ఆ కథను రంగనాయకమ్మ (Ranganayakamma)రాశారు. కానీ, ఆ కథ బాగుందని నిర్మాతకు చెప్పడంతో వారు రామలక్ష్మిదే కథ అని భావించి, అలా వేశామని తరువాత వివరణ ఇచ్చుకున్నారు. కానీ, కోర్టుకు ఎక్కిన రంగనాయకమ్మ వైపే న్యాయం నిలచింది. నిర్మాత అపరాధ సుంకం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆరుద్ర మరణం తరువాత రామలక్ష్మి ఆ నాటి జ్ఞాపకాలతో సాగారు. ఈ నేపథ్యంలో ఆమె ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలు వివాదాస్పదంగానూ మారాయి. యన్టీఆర్, (NTR) ఏయన్నార్, శోభన్ బాబు వంటి వారిజీవితాల్లోని విషయాలపైనా రామలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఆ విషయాల్లో అన్నీనిజాలు కాకపోయినా, ఆమె ముక్కుసూటి మాట అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేశాయి. ఏది ఏమైనా విలక్షణమైన వ్యక్తిత్వంతో సాగిన కె.రామలక్ష్మి తెలుగు సాహితీవనంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారనే చెప్పాలి.