TG: హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరో రెండు ఎబోలా కేసులు వెలుగుచూడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎబోలా లక్షణాలు ఉండటంతో ఇద్దరు రోగులను రాత్రి అపోలో ఆసుపత్రి నుంచి అత్యవసరంగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో వారికి ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యులు నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.