తిరుపతి జిల్లాలో గత నెల 25 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం జరగనున్న ఇంగ్లిష్ పరీక్షతో ముగియనున్నాయి. 52 పరీక్షా కేంద్రాల్లో గత పది రోజులుగా జరిగిన పరీక్షలకు సుమారు 92 శాతం మంది హాజరయ్యారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.