ADB: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం నార్నూర్లోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి బాలుర వసతి గృహంలో పదవ తరగతి పూర్తి చేసి, IIIT బాసరలో సీటు సంపాదించిన బట్లూరి సచిన్ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థిని ప్రోత్సహిస్తూ మెమోంటోతో బహుమతిని అందజేశారు.