KDP: జమ్మలమడుగు (M) పి.బొమ్మేపల్లి గ్రామంలోని ఓ దుకాణంలో గ్యాస్ లీకేజీతో గురువారం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో తినుబండారాలు, నగదు, విద్యుత్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితుడు హరినాథ్ రెడ్డి తెలిపారు. సుమారు రూ.1.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసాడు.