BPT: రేపల్లెలో ఓటర్ల జాబితా సవరణ పనుల పురోగతి 52.19 శాతమే ఉండటంపై బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. BLOలు రోజుకు 15 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల్లో జాప్యం అస్సలు సహించబోమని స్పష్టం చేశారు.