GNTR: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో రవాణా శాఖ అధికారులు గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎమర్జెన్సీ ద్వారాలు సక్రమంగా లేని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అధికారులు సీజ్ చేశారు. అయితే, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వారిని మరో బస్సులో గమ్యస్థానాలకు పంపేలా చర్యలు తీసుకున్నట్లు డీటీసీ సీతారామరెడ్డి తెలిపారు.