ATP: తాడిపత్రి రూరల్ పరిధిలోని చుక్కలూరు క్రాస్ వద్ద ఇవాళ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నట్లు మండల కన్వీనర్ విజయ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వారు అన్నారు. వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమంలో భాగంగా నిరసన చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.