KMR: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కింద నేటి నుండి 10వ తేదీ వరకు వార్డు సభలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగే ఈ సభల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ, వీధి దీపాల నిర్వహణపై చర్చించాలని తెలిపారు.