VZM: జలధార- జలహారతి ప్రాముఖ్యతను అందరికీ వివరించాలని DDO కిరణ్ కుమార్ సూచించారు. బుధవారం రామభద్రపురం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నీటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి నదులను పరిరక్షించాలనే సందేశాన్ని వ్యాప్తి చేయడం కోసం నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమమే జలహారతి అన్నారు. జలధారల పరిరక్షణ, నీటివనరుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని చాటి చెప్పాలన్నారు.