ఆసిఫాబాద్ జిల్లాలో CM రేవంత్ రెడ్డి పర్యటన వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని BJP జిల్లా ప్రధాన కార్యదర్శులు అరిగెల మల్లికార్జున్ యాదవ్, కోవ విజయ్ కుమార్ విమర్శించారు. కేంద్రం అందిస్తున్న PM -జన్మన్, PM ఆవాస్ యోజన ఇళ్లను ‘ఇందిరమ్మ ఇళ్లుగా మార్చి ప్రచారం చేయడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. రోడ్లు, వంతెనలు, సాగునీరు, రైతుల సమస్యలపై సీఎం స్పష్టత ఇవ్వలేదన్నారు.