AP: పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదని మంత్రి అనిత మండిపడ్డారు. గత ప్రభుత్వం గ్రూప్-1 ఎలా నిర్వహించిందో అందరం చూశామని ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. లేనిపోని ఆరోపణలు తప్ప వైసీపీ చేసేదేమీ ఉండదని చురకలంటించారు.