RR: ఖాజాగూడ సమీపంలో నిర్మాణంలో ఉన్న అండర్పాస్, ఫ్లైఓవర్ పనులను మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. వాహనదారుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించిన ఆయన, ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా ట్రాఫిక్ సాగేలా చూడాలని అధికారులను, నిర్మాణ సంస్థలను ఆదేశించారు.