IPLలో అదరగొట్టిన 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై IIM ఇండోర్ ప్రత్యేక అధ్యయనం నిర్వహించనుంది. చిన్న వయసులోనే అసాధారణ విజయాలు సాధించే బాల మేధావులపై ఖ్యాతి, ఒత్తిడి ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ఈ పరిశోధన సాగనుంది. వారి ప్రాక్టీస్, మనస్తత్వం, కోచ్లు, తల్లిదండ్రుల సహకారం వంటి విషయాలను పరిశీలిస్తామని IIM డైరెక్టర్ హిమాంశు రాయ్ తెలిపారు.