కోనసీమ: ఆలమూరు మండలం మోదుకూరులోని సత్యనారాయణ ట్రేడర్స్ రైస్ మిల్స్‌లో రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బియ్యం నిల్వలు, రికార్డులు, నాణ్యత ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనల అమలును పరిశీలించారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.